MJPTBC 6th 7th and 8th class Backlog Vacancies Admission Notification-2023

మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బిసి బాల బాలికల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను 6, 7, 8వ తరగతులలో (ఇంగ్లీషు మీడియం) స్టేట్ సిలబస్ లో ఖాళీ సీట్లకు బిసి, ఎస్.సి, ఎటి మరియు ఇబిసి అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. ప్రవేశ పరీక్ష తేది 10-05-2023 నాడు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును.

ముఖ్యమైన తేదీలు:

అంశం తేది
దరఖాస్తు మరియు ఫీజు చెల్లించుటకు ప్రారంభ తేది 07-03-2023
దరఖాస్తు మరియు ఫీజు చెల్లించుటకు చివరి తేది 20-04-2023
హాల్ టికెట్లు డౌన్ లోడ్ 02-05-2023
ప్రవేశ పరీక్ష తేది 10-05-2023
(10 AM-12 NOON)
పరీక్ష ఫీజు రూ.100/-

ప్రవేశమునకు అర్హత:

  1. 6వ తరగతి లో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 సం.లో 5వ తరగతి చదివి ఉండాలి.
  2. 7వ తరగతి లో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 సం.లో 6వ తరగతి చదివి ఉండాలి.
  3. 8 వ తరగతి లో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 సం.లో 7వ తరగతి చదివి ఉండాలి.
  4. విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 మరియ 2022-23 విద్యా సంవత్సరములలో నిరవధికంగా విద్యను అభ్యసించి ఉండవలెను.UDISE ఆధారంగా ప్రవేశాలను కల్పించబడును.

వయస్సు:

  1. 6వ తరగతికి: 31/08/2023 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సి/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.
  2. 7వ తరగతికి: 31/08/2023 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సి/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.
  3. 8వ తరగతికి: 31/08/2023 నాటికి 14 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సి/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.

ఆదాయ పరిమితి:

  1. విద్యార్థుల తల్లిదండ్రుల/సంరక్షకుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000/-
  2. పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000/- కు మించరాదు.

పాఠశాలలో ప్రవేశము:

  1. విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది.
  2. జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి పాత జిల్లాలోని ఏదైనా పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.

ప్రవేశ పరీక్షః

  1. ప్రవేశ పరీక్ష తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం (సైన్సు మరియు సాంఘిక శాస్త్రం) లలో 5, 6, 7వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు ఉంటుంది.
    తెలుగు-15
    లెక్కలు-30
    సామాన్య శాస్త్రం-15
    సాంఘిక శాస్త్రం-15
    ఇంగ్లీషు-25
    మార్కులతో ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది.
    జవాబులను ఓ.యం.ఆర్.షీట్లో గుర్తించాలి.

పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం:

అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి (అనాథ) మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును.

రిజర్వేషన్:

  1. BC-A:15%
    BC-B:25%
    BC-C:3%
    BC-D:17%
    BC-E:10%
    SC:15%
    ST:5%
    MBC:5%
    EBC/OTHERS:2%
    ORPHANS:3%
    TOTAL:100%

సీట్ల ఖాళీల వివరాలు:


6వ తరగతి ఖాళీ సీట్ల వివరాలు:

7వ తరగతి ఖాళీ సీట్ల వివరాలు:

8వ తరగతి ఖాళీ సీట్ల వివరాలు:

MJPTBC 6th 7th and 8th class Backlog Vacancies Admission Notification-2023
Latest Updates కోసం మా Whatsapp Group లో జాయిన్ కాగలరు.
JOIN HERE
Latest Updates కోసం మా Telegram Group లో జాయిన్ కాగలరు
JOIN HERE
ONLINE PAYMENT
CLICK HERE
ONLINE APPLICATION
CLICK HERE
NOTIFICATION DETAILES
CLICK HERE
MODEL OMR SHEET
CLICK HERE
Website
CLICK HERE

MJPTBCW 6th-7th-8th CLASSES VACANT SEATS ADMISSIONS

LATEST UPDATES

View more>>

TEACHERS CORNER

View more>>